: మంత్రాలతో ముచ్చెమటలు పట్టిస్తున్న సుధాకరన్.. వణుకుతున్న తోటి ఖైదీలు
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు జైలులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరన్ తోటి ఖైదీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మగ ఖైదీల వార్డులో ఉంటున్న ఆయన రోజూ కాళీమాత ఫొటోను ముందు పెట్టుకుని బిగ్గరగా మంత్రాలు చదువుతున్నారు. దీంతో అతడో మంత్రగాడని భావిస్తూ తోటి ఖైదీలు వణికిపోతున్నారు. ఆయనను వేరే వార్డుకు మార్చకుంటే తామిక్కడ ఉండలేమంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. సుధాకరన్ తీరుపై రోజూ ఫిర్యాదులు వస్తుండడంపై ఆయనను వేరే గదికి మార్చే విషయమై జైలు అధికారులు ఆలోచిస్తున్నారు.