: శశికళ ఆ 10 కోట్ల రూపాయల జరిమానా ఎలా చెల్లిస్తుంది?


తన ముందున్న ఓ గండాన్ని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఏ రకంగా దాటుతుందన్న ఆసక్తి అందర్లోనూ రేకెత్తుతోంది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు జయలలితకు 100 కోట్ల రూపాయలు, శశికళకు 10 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని ఆమె ఎలా చెల్లిస్తుందా? అన్న ఆసక్తి అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోంది. మరోపక్క, చెన్నైలో ఓ దర్యాప్తు సంస్థ సాయంతో జరిమానా సొమ్మును రికవరీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జైల్లో ఉన్న శశికళ గడువు లోపు జరిమానా చెల్లించలేకపోతే మరో 13 నెలల అదనపు జైలు శిక్ష తప్పదు. ఈ నేపథ్యంలో ఈ జరిమానా సొమ్మును ఎవరు? ఎలా? చెల్లిస్తారనే సందేహం రేగుతోంది. పైగా, ఇలా చెల్లించే సొమ్ము చట్టబద్ధమైనదై ఉండాలి.

మరోపక్క జయలలిత మేనల్లుడు దీపక్ తన అత్తకు సంబంధించిన కోర్టు జరిమానాకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు చెల్లిస్తానంటున్నాడు. మరి శశికళ 10 కోట్లు ఎలా చెల్లించనుంది? శశికళ పలు వ్యాపారాల్లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈ వ్యాపారాల చట్టబద్ధతపై పలు అనుమానాలున్నాయి. దీంతో ఆమె అంత మొత్తంలో వైట్ మనీ చెల్లించగలరా? అన్న సందేహం కలుగుతోంది. అలా కాకుంటే పార్టీ నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించాలి. అలా చెల్లించేందుకు పార్టీ అంగీకరించాలి. ఇందుకు వారు అంగీకరిస్తారా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. 

  • Loading...

More Telugu News