: ప్రణబ్ ముఖర్జీని కలిసిన స్టాలిన్!
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నేటి సాయంత్రం రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకున్న స్టాలిన్... ఇటీవల బలప్రదర్శన సందర్భంగా తమిళనాడు శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే, కేవలం అన్నాడీఎంకే నేతలతోనే స్పీకర్ విశ్వాసపరీక్ష నిర్వహించారని ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విశ్వాస పరీక్ష చెల్లుబాటు కాదని ప్రకటించి, రహస్య బ్యాలెట్ ద్వారా మళ్లీ బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. దీనిపై మద్రాసు హైకోర్టులో కేసు వేసిన డీఎంకే, ఇప్పటికే గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.