: స్వామి పరిపూర్ణానందపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేత రాఘవులు!
స్వామి పరిపూర్ణానందపై సీపీఎం నేత బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములు సాధారణ జీవితాన్ని త్యాగం చేసి, సాధు జీవనం గడపడం గౌరవప్రదంగా ఉంటుందని, రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆయన పరిపూర్ణానంద స్వామికి హితవు పలికారు. కడపలో ఆయన మాట్లాడుతూ, స్వామీజీలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకలపై ప్రజలకు లెక్కచెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.