: బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ కోటీశ్వరుడు గెలిచాడు!


బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిల్చిన రియల్టరైన కోటీశ్వరుడు పరాగ్ షా విజయం సాధించాడు. బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 690 కోట్ల రూపాయల ఆస్తులను ఆఫిడవిట్‌ లో ప్రకటించిన పరాగ్ షా ఘట్కోపర్‌ డివిజన్‌ కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్‌ చెదాపై విజయం సాధించారు.

రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణరంగంలో తన పెట్టుబడులు ఉన్నట్టు షా నామినేషన్‌ తో పాటు సమర్పించిన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఇందులో థానేలోని ఒక అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ ధర 8 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఎక్కువమంది గుజరాతీలు, దక్షిణ భారతీయ ఓటర్లు ఉన్న ఘట్కోపర్ కార్పొరేషన్ నుంచి ఆయన విజయం సాధించడం ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్‌ మెహతా మద్దతుతో పాటు, దక్షిణ భారతీయ ఓటర్లు మద్దతీయడంతో ఆయన విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

  • Loading...

More Telugu News