: ఆ సినిమా దర్శకుడు క్షమాపణలు చెప్పాలి: మాజీ మంత్రి పుష్పలీల


'ఇక సె.. లవ్‌’ సినిమా భారతీయ సాంప్రదాయాలు, వివాహ వ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి పుష్పలీల ఆరోపించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, భారతీయ వివాహ వ్యవస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా గౌరవం చూపిస్తారని అన్నారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసేలా సినిమా తీసిన దర్శకుడు నాగరాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అలా కాదని ఆయన వాదనకు దిగితే బహిరంగ చర్చకు రావాలని ఆమె డిమాండ్‌ చేశారు.

దీనిపై పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుంటే తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, వృద్ధాప్యం రాగానే ఆశ్రమాల్లో వేసేయాలనే ఆలోచనలను రేకెత్తించే విధంగా ఈ సినిమా ఉందని ఆమె మండిపడ్డారు. మహిళలు, వివాహ వ్యవస్థను కించపరుస్తూ ఎన్నో డైలాగులు ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News