: 'నిన్ను కోరి' అంటున్న నాని!
టాలీవుడ్ నటుడు నాని 'నిన్ను కోరి' అంటూ అభిమానులను పలకరించేందుకు వస్తున్నాడు. ఈ మధ్యే 'నేను లోకల్' అంటూ వచ్చి ఆకట్టుకున్న నాని, తాజాగా శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. రేపు నాని పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ ను నాని రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో ఫస్ట్ లుక్ పోస్టు చేసిన నాని... వైజాగ్ నుంచి యూఎస్ఏ వరకు... చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు...లవర్స్ నుంచి పెళ్లైన వాళ్ల వరకు అంటూ 'నిన్ను కోరి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్టు చేశాడు. ఇది నాని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.