: చెత్తను ప్యాక్ చేసి పంపించి కుమారుడికి బుద్ధి చెప్పిన తల్లి!


అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. న్యూ విల్లింగ్టన్ ప్రాంతంలోని వెస్ట్ మినిస్టర్ కాలేజిలో చ‌దువుతున్న కానార్ కాక్స్ అనే 18 ఏళ్ల‌ విద్యార్థి ఇటీవ‌లే త‌న ఇంటి నుంచి తిరిగి హాస్ట‌ల్‌కి వ‌చ్చాడు. అయితే, వ‌చ్చిన కొన్ని రోజుల‌కి తన తల్లి పంపిన రెండు బాక్సుల పార్సిల్స్ ను అందుకున్నాడు. వాటిని తెర‌చి చూడ‌గా ఒక దాంట్లో బొమ్మలు, ఆహార పదార్థాలు ఉన్నాయి. రెండో దాంట్లో మాత్రం మొత్తం చెత్త ఉంది. అయితే, త‌న త‌ల్లి పొరపాటున ఆ బాక్సుని పంపించిందేమో అనుకొని తన తల్లికి ఫోన్ చేసి అడిగాడు.

కానీ త‌న త‌ల్లి నుంచి వ‌చ్చిన స‌మాధానం విని షాక‌య్యాడు. తాను పొరపాటుగా ఏమీ పంప‌లేద‌ని, 'అదంతా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు వేసిన చెత్తే'న‌ని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ చెత్త‌ను ఎత్త‌కుండా వ‌చ్చినందుకే దాన్ని పార్సిల్‌గా పంపాన‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ స‌ద‌రు విద్యార్థి ఆ చెత్తతో నిండిన పెట్టెను ఫొటో తీసి త‌న‌ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News