: ఇన్‌స్టాగ్రాంలో ఇకపై 10 వీడియోలను ఒకేసారి పంపుకోవచ్చు!
ఇన్‌స్టాగ్రాం యూజర్లందరికీ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఇన్‌స్టాగ్రాంను వాడుతున్న వారు ఇకపై 10 ఫొటోలు లేదా వీడియోలను ఒకేసారి సెండ్ చేసుకోవచ్చు. వాటిని యూజర్లు తమకు ఇష్టమున్న ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేసుకుని పంపే సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇన్‌స్టాగ్రాం బీటా వర్షన్ యాప్‌ను వాడుతున్న యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సదుపాయం పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రాం ప్రతినిధులు తెలిపారు. కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ సౌకర్యాన్ని పొందచ్చు.