: ముంబైలో బోణీ కొట్టిన ఒవైసీల ఎంఐఎం పార్టీ


అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. మొత్తం మూడు స్థానాలను కైవసం చేసుకొని, సత్తా చాటింది. ఇప్పటి వరకు హైదరాబాదుకే పరిమితమయిందనుకున్న మజ్లిస్... ముంబైలో కూడా అడుగుపెట్టింది. మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో 59 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో మజ్లిస్ 8 స్థానాల వరకు గెలుచుకోవచ్చని కొందరు అంచనా వేశారు. ఏదేమైనప్పటికీ ముంబై కార్పొరేషన్ లో అడుగుపెడుతుండటం ఎంఐఎంకు అంతులేని విశ్వాసాన్ని కలిగించే అంశమే. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బైకుల్లా స్థానాలలో మజ్లిస్ గెలుపొందింది.

  • Loading...

More Telugu News