: అలా అనడం జగన్‌కు తప్ప మరెవరికీ సాధ్యం కాదు: మంత్రి అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి నిన్న బహిరంగ లేఖ రాస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగుల దుస్థితిని గురించి తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును విమర్శించిన జగన్‌కు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.లక్షా 15వేల కోట్లను నిరుద్యోగ భృతికి కేటాయించాలని వైఎస్ జగన్.. చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారని, అయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్టే రూ.లక్షా 30 వేల కోట్లలోనే ఉందని, అలాంటప్పుడు ఇక నిరుద్యోగ భృతికి అంత ఎలా కేటాయిస్తామని అన్నారు. నిరుద్యోగ భృతికి అంత కేటాయించాలని అనడం జగన్‌కు తప్ప మరెవరికీ సాధ్యం కాదని చురకలు అంటించారు.