: రూ.680 కోట్ల‌ కంపెనీ నిధులతో హాంకాంగ్ పారిపోయిన ఏబీబీ కంపెనీ ఉద్యోగి


ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ కంపెనీ ఉద్యోగి ఒక‌రు ఏకంగా వంద మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు రూ.680 కోట్లు) తో పారిపోయాడు. ఆ కంపెనీకి చెందిన ద‌క్షిణ కొరియా శాఖ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. కంపెనీ నిధుల‌ను చోరీ చేసే క్ర‌మంలో ఓ అనుమానిత వ్య‌క్తి బ‌య‌టి వ్య‌క్తుల‌తో కలసి పలు డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేసిన‌ట్లు గుర్తించారు. ఆ కంపెనీ శాఖ‌లో దాదాపు 800 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, డ‌బ్బుల‌తో పారిపోయిన ఆ వ్య‌క్తి హాంకాంగ్ వెళ్లి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు. అక్క‌డి నుంచి నిందితుడిని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పారు. స‌ద‌రు కంపెనీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు ల‌క్షా 30 వేల మంది ప‌నిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News