: నెత్తురోడిన లాహోర్.. డిఫెన్స్ ఏరియాలో పేలుడు
పాకిస్థాన్ లో మరోసారి పేలుడు సంభవించింది. లాహోర్ సిటీలోని డిఫెన్స్ ఏరియాలో ఈ పేలుడు జరిగింది. డిఫెన్స్ ఏరియాలో ఉన్న ఓ రెస్టారెంట్ లో పేలుడు సంభవించడంతో, ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ప్రాంతాన్ని పోలీసులు చుట్టు ముట్టారు. పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. జనరేటర్ బ్లాస్ట్ కావడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని స్థానిక పంజాబ్ ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే, దీని వెనుక టెర్రరిస్టుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.