: వాజ్‌పేయికి మత్తుమందు ఇచ్చారు.. రాజకీయాలు అర్థం కాని స్థితికి ఆయనను తీసుకొచ్చారు: లాలూ సంచలన వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ కురువృద్దుడు, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎంతో కాలంగా ఎవ్వరికీ కనిపించకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయనకు భారత్ రత్న అందించే క్రమంలోనూ కనీసం ఆయన వీడియో కూడా విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్యంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయికి మత్తు ఇచ్చి, ఆయనకు రాజకీయాలు అర్థం కాని పరిస్థితి సృష్టించారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆయన ఆరోగ్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
లాలూ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాథామోహన్ సింగ్ మండిపడ్డారు. లాలూ వ్యాఖ్యలను పట్టించుకునే అవసరం లేదని అన్నారు. ఆర్జేడీ మిత్ర పక్షమైన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఆ వ్యాఖ్యలను పట్టించుకోరని ఆయన విమర్శించారు.