: ఆత్మీయంగా, ఆనందంగా మాట్లాడుకున్న చిరంజీవి, బాలకృష్ణ


తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లులాంటి వారు చిరంజీవి, బాలకృష్ణ. వారిద్దరి మధ్య ఉన్న బంధం కూడా బలమైనదే. ఇటీవల ఓ సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో తనకు ఎక్కువ మంది మిత్రులు లేరని... తనకు ఆత్మీయుడు ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవేనని చెప్పారు. చిరంజీవి కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ, బాలకృష్ణ తనకు అత్యంత ఆత్మీయుడని అన్నారు.

తాజాగా ఈ ఇద్దరు సీనీ దిగ్గజాలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆనందంగా కాసేపు గడిపారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ వివాహ వేడుక వీరి కలయికకు వేదికయింది. నిన్న రాత్రి జరిగిన రిసెప్షన్ కు చిరంజీవి, బాలయ్యలు వచ్చారు. పలకరింపులయ్యాక, ఇద్దరూ కాసేపు ఆనందంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అందరి చూపులూ వీరిద్దరి మీదే నిలిచాయి. 

  • Loading...

More Telugu News