: చిరు, పవన్‌లతో మల్టీస్టారర్‌ సినిమా కోసం కథ రెడీ అవుతోంది: సుబ్బరామిరెడ్డి


మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లతో మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తానని ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఇటీవ‌లే ప‌లుసార్లు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే, అది అయ్యే ప‌నికాద‌ని ఎంతో మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో మ‌రోసారి స్పందించిన సుబ్బ‌రామిరెడ్డి చిరు, ప‌వ‌న్‌ల‌తో మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని ఈ రోజు స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాకి  అశ్వనీదత్ కూడా నిర్మాతగా ఉంటారని చెప్పారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అధికంగా ఉంటాయని చెప్పారు. అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే క‌థ‌ను రెడీ చేస్తున్నామని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రేపు కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తామ‌ని, దీనికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న చెప్పారు. పెందుర్తి శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి కూడా వ‌స్తార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News