: అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ విడిపోవటానికి కారణమిదేనట!


యంగ్ హీరో అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయినట్టు మీడియాలో నిన్న వార్తలు వెలువడ్డాయి. వారం క్రితం వరకు అంతా బాగానే ఉందని, సడన్ గా ఇలా జరిగిపోయిందని కథనాలు వచ్చాయి. కానీ, వీరిద్దరి మధ్య బ్రేకప్ ఎప్పుడో అయిపోయిందట.

నిజం చెప్పాలంటే ఈ పెళ్లి అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జునకు అసలు ఇష్టం లేదట. అఖిల్ వయసు కేవలం 22 సంవత్సరాలే కావడం... అఖిల్ కంటే శ్రియ వయసులో పెద్దది కావడం నాగార్జునకు నచ్చలేదట. ఇదే విషయం గురించి అఖిల్ కు నచ్చజెప్పేందుకు నాగ్ ప్రయత్నించారట. అంతేకాదు, నాగచైతన్య కూడా అఖిల్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. అయినా అఖిల్ వినకపోవడంతో... వారి పెళ్లికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, ఇటలీలోని రోమ్ లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రియా భూపాల్, ఆమె తల్లి బయల్దేరారట. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అఖిల్, శ్రియల మధ్య విభేదాలు తలెత్తాయట. ఈ క్రమంలో, విమానాశ్రయంలో వారిద్దరూ బహిరంగంగానే వాదనకు దిగారట. ఆ తర్వాత వారిద్దరికీ గుడ్ బై చెప్పేసి... అఖిల్ ఇంటికి వెళ్లిపోయాడట. అఖిల్ ను వారించే ప్రయత్నం శ్రియ కాని, ఆమె తల్లి కాని చేయలేదట. ఆ తర్వాత వీరిద్దరినీ కలిపే ప్రయత్నాన్ని ఇటు నాగార్జున, అటు శ్రియ తాత జీవీ కృష్ణారెడ్డి చేసినప్పటికీ... ఫలితం దక్కలేదు. దీంతో, చేసేదేమీ లేక నాగ్ సైలెంట్ అయిపోయారట.

  • Loading...

More Telugu News