: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
పూణేలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వడివడిగా వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ వరకు నిలకడగా ఆడిన ఆసీస్ బ్యాట్స్ మెన్... సెకండ్ సెషన్ లో తడబడ్డారు. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది ఆసీస్. 119 పరుగుల వద్ద రెండో వికెట్ (షాన్ మార్ష్)ను ఆస్ట్రేలియా కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి షాన్ మార్ష్ (16) ఔట్ అయ్యాడు. అనంతరం హ్యాండ్స్ కోంబ్ (22) ఔట్ అయ్యాడు.
జడేజా బౌలింగ్ లో హ్యాండ్స్ కోంబ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్ (27) అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆసీస్ స్కోరు 149 పరుగులు ఉన్నప్పుడు హ్యాండ్స్ కోంబ్, స్మిత్ లు వరుసగా ఔట్ అయ్యారు. ప్రస్తుతం రెన్షా (38), మిచెల్ మార్ష్ (2)లు క్రీజులో ఉన్నారు. అశ్విన్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, జడేజాలు చెరో వికెట్ తీశారు.