: నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు: ప్రధాన నిందితుడి అరెస్ట్
దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సినీనటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ ఈ రోజు కేరళలోని ఎర్నాకులం కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. అయితే, అతడు లొంగిపోకముందే అతడిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతడు భావన కిడ్నాప్ విషయంలో ఓ బడా నిర్మాతకు నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సునీల్ కుమార్‌తో పాటు మరో నిందితుడు విగీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సునీల్ అరెస్టు కావడంతో ఈ దారుణం వెనుక ఉన్న పెద్దల వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
భావనపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ కన్నడ, మలయాళ, తెలుగు సినీ నటులతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.