: జస్టిన్ బీబర్ ముంబై షో.. టికెట్ రేటు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయ్!


కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ లో పర్యటించనున్నాడు. చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న బీబర్... మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ షోలో దాదాపు 10 పాటలను బీబర్ ప్రదర్శించే అవకాశం ఉంది. నిన్నటి నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ షోకు అంతర్జాతీయ స్థాయి వీవీఐపీలు హాజరవుతున్నారట. దీంతో, వారికోసం ఏర్పాటు చేసిన వీవీఐపీ గ్యాలరీ టికెట్ ధరను రూ. 76వేలుగా నిర్ణయించారు. ఇప్పటికే  ఈ టికెట్లన్నీ అమ్ముడుబోయాయట. ఆ తర్వాత వివిధ కేటగిరీల్లో రూ. 4వేల వరకు టికెట్ ధరలు ఉన్నాయి. కొన్ని గంటల్లోనే ఈ టికెట్లన్నీ కూడా అమ్ముడుబోతాయని నిర్వాహకులు చెప్పారు. బీబర్ పర్యటనకు వైట్ ఫాక్స్ ఇండియా ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది.

  • Loading...

More Telugu News