: అమ్మకి ఆలయం కట్టిస్తున్న రాఘవ లారెన్స్!


నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనిపించుకున్న రాఘ‌వ లారెన్స్  త‌న తల్లికి ఆలయం కట్టిస్తున్నాడు. తల్లి జీవించి ఉండగానే ఇలా గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాడు లారెన్స్‌. తన ఫేవ‌రేట్ గాడ్ రాఘవేంద్ర స్వామి గుడి ఎదురుగానే తన తల్లికి ఈ మందిరం క‌ట్టిస్తున్నాడు. త‌న అమ్మ ఎన్నో కష్టాలు ప‌డి త‌న‌ను ఇంత‌టి వాడిని చేసింద‌ని, ఆమె రుణం తీర్చుకోవడానికి, తల్లి గొప్పదనాన్ని లోకానికి చాటడానికి ఈ ప‌నిచేస్తున్నాన‌ని లారెన్స్ అన్నాడు.

తన తల్లి కన్మణి కోసం ప్ర‌త్యేకంగా రాజ‌స్థాన్‌లో త‌యారు చేయించిన 5 అడుగుల పాలరాతి ప్రతిమను తాజాగా తెప్పించాడు. మార్చిలో త‌మిళ‌నాడులో నిర్వ‌హించే ఉగాది రోజున త‌న త‌ల్లి విగ్రహాన్ని నెలకొల్పుతానని అన్నాడు. అంతేకాదు, ఆమెపై ఓ పుస్త‌కం కూడా రాస్తాన‌ని చెబుతున్నాడు. సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ చురుకుగా పాల్గొనే రాఘ‌వ లారెన్స్ త‌న త‌ల్లి విగ్ర‌హాన్ని నెల‌కొల్పుతూ తల్లి ప‌ట్ల ఎన‌లేని భ‌క్తి, గౌర‌వాన్ని చాటుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News