: 5 వేల మంది అరెస్టయ్యారు.. స‌ర్కారు మీసాలు మెలివేస్తే అంత‌క‌న్నా అన్యాయం మ‌రొక‌టి లేదు: కోదండ‌రాం


హైద‌రాబాద్‌లో నిరుద్యోగ నిర‌స‌న‌ ర్యాలీని నిర్వ‌హించాల‌ని చూసిన నేపథ్యంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారని, స‌ర్కారు మీసాలు మెలివేస్తే అంత‌క‌న్నా అన్యాయం మ‌రొక‌టి లేదని టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం అన్నారు. నిన్న హైదరాబాద్ అంతటా బారికేడ్లు వేసి, టీజేఏసీ ర్యాలీకి మద్దతు తెలిపిన వారిని అడ్డుకున్నప్పటికీ పలు చోట్ల ర్యాలీ నిర్వహించారని అన్నారు. ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించిన వారిలో మొత్తం ఐదు వేల మంది అరెస్టు అయ్యారని కోదండరాం చెప్పారు. నిన్న ఇందిరా పార్కును మొత్తం పోలీసులు దిగ్బంధం చేశారని చెప్పారు.

హాస్ట‌ళ్ల ముందు, వర్సిటీల్లో పోలీసులు మోహరించారని కోదండరాం చెప్పారు. పోలీసులు ఎంత‌గా అడ్డుకున్నా యూనివ‌ర్సిటీల్లో ర్యాలీ నిర్వ‌హించారని చెప్పారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం వ‌ద్ద కూడా నిర‌స‌న తెలిపారని అన్నారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవాలని చూసినప్పటికీ నిరుద్యోగ సమస్యపై ర్యాలీ జరిపితే ఎంత ప్ర‌చారం జ‌రిగేదో అంతే స్థాయిలో నిన్న ప్ర‌చారం జ‌రిగింద‌ని విద్యార్థి సంఘాలు తెలిపాయని అన్నారు.

  • Loading...

More Telugu News