: పుణె టెస్టులో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు


భారత్‌-ఆస్ట్రేలియాల క్రికెట్ జ‌ట్ల మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కొన‌సాగుతున్న మొదటి టెస్ట్ మ్యాచు మొద‌టి రోజు ఆట‌లో ఆస్ట్రేలియా లంచ్‌ విరామానికి వికెట్‌ నష్టపోయి 84 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా, టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఆటగాడిని అత్యధిక సార్లు అవుట్ చేసిన రికార్డును న‌మోదు చేసుకున్నాడు. ఓపెన‌ర్‌గా క్రీజులోకి వ‌చ్చిన డేవిడ్‌ వార్నర్ 38 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరువ‌ద్ద‌ వికెట్‌ కోల్పోయాడు. టెస్టుల్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వార్నర్ అవుట్ కావడం ఇది ఐదోసారి. ఈ మ్యాచ్ ముందు వ‌ర‌కు ఆస్ట్రేలియా బౌలర్ షాన్ మార్ష్ ఐదుసార్లు అత్యధికంగా ఒక ఆటగాడిని అవుట్ చేసిన బౌల‌ర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఉమేశ్ యాద‌వ్ కూడా ఆయ‌న ప‌క్క‌న చేరాడు.

ఈరోజు ఇన్నింగ్స్ తో కలుపుకుని వార్నర్ ఐదోసారి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తద్వారా ఆసీస్ బౌలర్ షాన్ మార్ష్ తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు షాన్ మార్ష్  ఐదుసార్లు అత్యధికంగా ఒక ఆటగాడిని అవుట్ చేసిన ఘనతను సాధించాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 28 ఓవర్ రెండో బంతికి వార్నర్ బౌల్డ్(38) అయ్యాడు.  






  • Loading...

More Telugu News