: ట్రైన్ లో ఫుట్‌బోర్డ్ ప్రయాణం... ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు యువకుల మృతి
ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసి కూడా ఏమాత్రం లెక్కచేయకుండా యువకులు ప్రవర్తిస్తోన్న తీరు వారి ప్రాణాలను తీస్తోంది. అత్యుత్సాహం, ఆనందం ముసుగులో చేస్తోన్న సాహసం నిండు జీవితాలను బలి తీసుకుంటోంది. వారిని కన్నవారికి శోకాన్ని మిగిలిస్తోంది. తాజాగా చెన్నై నగరంలో ఫుట్‌బోర్డ్ ప్రయాణం ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. చెన్నై నుంచి చెంగల్‌పట్టుకు వెళుతున్న ఒక లోకల్ రైల్లో ముగ్గురు యువకులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా పట్టాలపక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సెయింట్ థామస్ మౌంట్ వద్ద జరిగింది.