: ఢిల్లీకి చేరిన తమిళనాడు రాజకీయాలు.. రాష్ట్రపతిని కలవనున్న స్టాలిన్ బృందం!


ఈ నెల 18వ తేదీన త‌మిళ‌నాడు శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎడప్పాడి పళనిస్వామి మెజారిటీ నిరూపించుకొన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ స‌మావేశం జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష డీఎంకే కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు స్టాలిన్ నేతృత్వంలో పార్టీ నేత‌లు ఈ రోజు ఢిల్లీకి ప‌య‌నం కానున్నారు. ఈ రోజు సాయంత్రం వారంతా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌లిసి విశ్వాస ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావుకి ఆదేశాలు చేయాల‌ని కోర‌నున్నారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేకుండా విశ్వాస ప‌రీక్ష జ‌ర‌గ‌డం స‌రికాద‌ని వారు తెల‌ప‌నున్నారు.

  • Loading...

More Telugu News