: హైద‌రాబాద్‌లో దారుణం.. కిరాయిదారుల బెడ్రూంలలో రహస్యంగా సీసీ కెమెరాలు


హైద‌రాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో ఓ అపార్ట్‌మెంట్ ఓన‌ర్ పాల్ప‌డ్డ‌ నీచ చేష్ట‌లు ఆల‌స్యంగా వెలుగులోకొచ్చాయి. త‌మ అపార్ట్‌మెంట్ల‌లో కిరాయికి ఉంటున్న వారికి తెలియ‌కుండా బెడ్రూంలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఇంటీరియర్ డిజైన్ కీబోర్డులో వాటిని ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పెట్టాడు. అద్దెదారులకు తెలియకుండా వారి వ్యవహారాలను రికార్డు చేశాడు. చివ‌రికి ఓ అద్దెదారుడు విష‌యాన్ని గుర్తించ‌డంతో అత‌డి బండారం బ‌య‌ట‌ప‌డింది. అద్దెదారులంతా క‌లిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విజయ్ నంద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స‌ద‌రు య‌జ‌మాని తన ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులోని బెడ్‌రూంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News