: స్టాలిన్‌పై దాడి జరిగిందని ఆత్మహత్య చేసుకున్న అభిమాని
ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై దాడి జరిగిందని వార్తలు రావడంతో ఆయన అభిమాని ఒకరు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చోనాత్తుచావిడి 9వ వార్డు డీఎంకే కార్యదర్శి అయిన కడలూరు జిల్లా ముదునగర్‌కు చెందిన వడివేలు (45) ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే నేతలు ఆయన కుటుంబానికి ఆర్థికసహాయాన్ని అందించారు. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వడివేలు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.