: వీధి కుక్క బీభత్సం.. జనాన్ని వెంటాడి మరీ కరిచిన వైనం.. 41మందికి తీవ్రగాయాలు


ఒకే ఒక గ్రామ సింహం వీధి జ‌నాన్ని బెంబేలెత్తించింది. ఆ శున‌కం తెచ్చుకున్న ఆగ్ర‌హానికి జ‌నాలంతా ప‌రుగులు పెట్టారు. ప‌రుగులు తీస్తోన్న వారిని ఎవ‌రినీ వ‌ద‌ల‌లేదు.. వెంటాడి మ‌రీ మొత్తం 41 మంది పాదచారులను కరచింది. చెన్నై నగరం పరిధిలోని చెంగల్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని విద్యాసాగర్ రావునగర్ లో ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో దాన్ని ప్రజలు రాళ్లతో కొట్టారు. అంతే, అదే వారు చేసిన త‌ప్పు. రెచ్చిపోయిన కుక్క త‌న‌కు క‌న‌ప‌డిన వారి పైకి దూసుకెళ్లింది. పంటితో, కాళ్ల గోళ్ల‌తో వారిపై దాడి చేసి వారి ర‌క్తం క‌ళ్ల చూసింది.

దీంతో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల‌కు క్యూ కట్టి, ఇంజెక్షన్లు చేయించుకున్నారు. 28 మంది కుక్క కాటు బాధితులు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. కుక్క భ‌యానికి ప‌రుగులు తీస్తూ మరికొందరు కిందపడి గాయాల పాలయ్యారు. ప్రభుత్వ సిబ్బంది వ‌చ్చి కుక్కను పట్టుకోలేకపోతే తామే దాన్ని పట్టుకొని చంపేస్తామని అక్క‌డి ప్ర‌జ‌లు అంటున్నారు.

  • Loading...

More Telugu News