: మాల్యానా మజాకానా... బ్రిటన్ లో రేసు మొదలెట్టారు!


మన దేశంలోని బ్యాంకులకు శఠగోపం పెట్టి, లండన్ కు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారు. నివసిస్తున్న దేశం మాత్రమే మారింది... ఆయన రాజసం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బ్రిటన్ వెళ్లిన తర్వాత తొలిసారి ఆయన బహిరంగంగా కనిపించారు. బ్రిటన్ లో ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ రేసులో ఆయనకు చెందిన 'సహారా ఫోర్స్ వన్' కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన ఫార్ములా వన్ డ్రైవర్లు సెర్జియో పెరెజ్, ఈస్టెబాన్ లతో కలసి ఆయన దర్జాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను ఫార్ములా వన్ తన వెబ్ సైట్ లో పెట్టింది.

  • Loading...

More Telugu News