: పెట్రోల్ పార్టీపై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్ల వీర మరణం


జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఆర్మీ పెట్రోల్ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ మృతి చెందింది. గత మూడువారాల్లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరగడం ఇది మూడోసారి. ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News