: నోట్లు ముద్రించడం చేతకాదు కానీ.. దేశాన్ని మాత్రం పాలిస్తారట!: మోదీపై కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు


ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నకిలీ రెండువేల రూపాయల నోట్లు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నోట్లు సరిగా ముద్రించడం చేతకాని ప్రధాని మోదీ దేశాన్ని ఎలా నడపగలుగుతారని ప్రశ్నించారు. దేశాన్ని నవ్వుల పాలు చేశారని ఓ ట్వీట్‌లో ధ్వజమెత్తారు. స్థానికంగా ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు రావడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. నకిలీ నోట్ల అంతం చూసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పు కొచ్చిన మోదీ తాజా ఘటనపై ఏమని సమాధానం చెబుతారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా ఎస్‌బీఐ నుంచి వచ్చిన నకిలీ నోట్లపై విచారణ జరుగుతోందని ఆర్బీఐ ప్రకటించింది.

  • Loading...

More Telugu News