: నటి భావన కేసులోకి నన్నెందుకు లాగుతున్నారు?: మలయాళ నటుడు దిలీప్ ఆగ్రహం


మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులోకి తననెందుకు లాగుతున్నారంటూ మలయాళ నటుడు దిలీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భావన కేసులో పోలీసులు ఓ నటుడిని ప్రశ్నించారని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన, ఓ వర్గం కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ప్రచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి పోలీసులు రాలేదని, తననెవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. పోలీసులు నిజాయతీగా దర్యాప్తు చేసి అసలైన నిందితులను పట్టుకోవాలని కోరారు. వారికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా చూడాలని వేడుకుంటున్నట్టు తెలిపారు.

కాగా నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీని అరెస్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తోందన్న ఆయన నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ దాడి వెనక సీపీఎం ప్రముఖ నేత కుమారుల హస్తం ఉందన్న వార్తలను ముఖ్యమంత్రి కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News