: ప్రభుత్వాలు ఏవైనా.. నేను మాత్రం ఇలాగే ఉంటా.. స్పష్టం చేసిన కమల్


తమిళనాడులో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కమలహాసన్ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా తన వైఖరి మారబోదని స్పష్టం చేశారు. జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న తన అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్న కమల్ ఇది ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

పాలకులు, ప్రభుత్వాలు మారినా తన వైఖరి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, అందులో కొంచెం కూడా మార్పు ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు పవర్ లోకి వచ్చినా తానిలాగే స్పందిస్తూ ఉంటానని తేల్చి చెప్పారు. తాను రాజకీయాలకు సరిపడనని ఇది వరకే పేర్కొన్న కమల్, రాజకీయ పరిణామాలపై మాత్రం నిత్యం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను  పంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News