: జగదాంబ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు... తగులబడిపోయిన టైటాన్, ఫాస్ట్ ట్రాక్ షోరూంలు


విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్ లో గల టైటాన్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే... వైజాగ్ లోని జగదాంబ సెంటర్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో టైటాన్ షోరూం వుంది. దీనిని ఆనుకుని ఫాస్ట్ ట్రాక్ షోరూం ఉంది. దానితోపాటు ఈ కాంప్లెక్స్ లో ఐసీఐసీఐకి చెందిన ఏటీఎంతో పాటు పలు బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి. సాయంత్రం ఒక బల్బ్ నుంచి మంటలు వచ్చాయని, క్షణాల్లో దట్టమైన పొగతో కూడిన మంటలు షాపంతా అలముకున్నాయని అక్కడి వారు తెలిపారు.

కనీసం బ్యాగులు, మొబైల్స్ బయటకు తెచ్చుకునే అవకాశం కూడా తమకు చిక్కలేదని, కట్టుబట్టలతో బయటకు రాగలిగామని వారు చెప్పారు. సుమారు మూడు ఫైర్ ఇంజన్లతో అర్ధగంటకుపైగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలు, మంటలు మినహా మరేమీ కనిపించడం లేదని, వాటిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. టైటాన్ షోరూం, ఫాస్ట్ ట్రాక్ షోరూంకు మాత్రమే మంటలు పరిమితమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News