: ఇంటర్ పరీక్షల్లో సాయం చేయండంటూ పిలుపునిచ్చిన 'ఉయ్యాలా జంపాలా' నటి!


'ఉయ్యాలా జంపాలా' ' సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పునర్ణవి భూపాలం సోషల్ మీడియాలో ఇంటర్ పరీక్షల్లో సాయం చేయమని పిలుపునిచ్చి గొప్పమనసు చాటుకుంది. అందర్లా సాయం చేయమని కోరడంతోనే ఆగని ఈ యువనటి వాట్స్ యాప్ నెంబర్ కూడా తెలిపింది. సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా కళాశాలలో అంధవిద్యార్థులు చదువుతున్నారని, వారికి సహాయకులు అవసరమని తెలిపింది.

మనసున్న మారాజులు స్పందించి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో వారు చెప్పింది యథాతథంగా రాయగల సామర్థ్యమున్నవారు వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. కామర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారైతే మరీ మంచిదని తెలిపింది. వారికి సహాయం చేసే గొప్ప మనసున్నవారంతా 9959580291 నెంబర్ కు వాట్స్ యాప్ చేయాలని సూచించింది. దీంతో వయసు చిన్నదైనా ఆమె సహాయం చేసే తత్వానికి సోషల్ మీడియాలో అద్భుత స్పందన లభిస్తోంది. 

  • Loading...

More Telugu News