: స్పైస్ జెట్ కు తప్పిన పెను ముప్పు!


పూణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. పూణేలోని లోహెగావ్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎస్జీ 999 స్పైస్‌ జెట్‌ విమానం ఢిల్లీకి బయల్దేరాల్సి ఉంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్లు కూడా అవుతున్నాయి. ఇంతలో విమానమెక్కిన పైలట్ అన్ని తనిఖీ చేసుకున్నారు. చివరగా సీట్లో కూర్చోబోతూ తన పక్కనుండే కిటికీ వైపు చూసి షాక్ తిన్నారు. అది బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చి, ముందు మరమ్మతులు చేపట్టాలని సూచించాడు. దీంతో వెంటనే నిపుణులు విమానం వద్దకెళ్లి దాని మరమ్మతులు చేపట్టారు. దానిని సరిదిద్దిన తరువాత ప్రయాణానికి సిద్ధం చేశారు. దీంతో 9 గంటల ఆలస్యంగా ఆ విమానం బయల్దేరింది. పైలట్ దానిని గుర్తించి ఉండకపోతే పెను ప్రమాదం సంభవించి ఉండేదని వారు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News