: పీడ వదలాలంటూ గ్రామాన్ని వదిలిపెట్టారు... చీకటి పడగానే గ్రామస్తులంతా మళ్లీ వచ్చేశారు!
ఖమ్మం జిల్లాలోని శివారు ప్రాంతం ఎదులాపురంలో నిన్న వింత సంఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ప్రభావం ఆ ఊరిపై బాగానే పడింది. ఊరిలోని వారంతా ఇల్లు వాకిలీ వదిలేసి వెళ్లిపోయారు. తిరిగి రాత్రికి తమ ఇళ్లకు చేరుకున్నారు. తమ ఊరికి కీడు పట్టిందని భావించిన గ్రామస్తులంతా మంచి జరగాలంటూ గ్రామాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్లిపోయారు. ఊర్లోని ఇళ్లు, దుకాణాలు అన్నింటికీ తాళాలు వేశారు. రోజంతా అడవిలోనే గడిపి అక్కడే అన్ని పనులు చేసుకొని చీకటి పడే సమయానికి తిరిగి వచ్చేశారు. ఇలా చేస్తే గ్రామానికి పట్టిన కీడు వదులుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.