: మేం కోహ్లీని కొనుగోలు చేయాలని చూశాం: హర్భజన్ సింగ్


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఐపీఎల్ వేలంలో తమ జట్టు యాజమాన్యం కొనుగోలు చేయాలని భావించిందని ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ తెలిపాడు. అయితే కోహ్లీ కొనుగోలు సంగతి ఇప్పటిది కాదని, ఐపీఎల్‌ ప్రారంభమైన 2008లోనిదని హర్భజన్ స్పష్టం చేశాడు. 2008లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కేవలం 30 వేల డాలర్లకు విరాట్ కోహ్లీని కొనుగోలు చేసిందని హర్భజన్ గుర్తుచేశాడు. కోహ్లీ కేవలం అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని, మంచి నటుడు కూడా అని భజ్జీ వెల్లడించాడు. కోహ్లీని ఆర్సీబీ వదలడం లేదని, అలా వదిలితే తమ జట్టు కోనుగోలు చేసేదని భజ్జీ చెప్పాడు. తామిద్దరం ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆదిలో కొనుగోలు చేసిన జట్లతోనే కొనసాగుతున్నామని తెలిపాడు. దశాబ్దం గడిచినా తాము టీమ్ లు మారలేదని చెప్పాడు. 

  • Loading...

More Telugu News