: నన్ను అరెస్టు చేసిన తీరు అభ్యంతరకరం: ప్రొ.కోదండరాం


హైద‌రాబాద్‌లో ఈ రోజు నిరుద్యోగ ర్యాలీకి పిలుపునిచ్చిన టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాంను ముంద‌స్తుగా పోలీసులు అరెస్టు చేసి కామాటిపుర పోలీసుస్టేష‌న్‌కి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను అక్క‌డి నుంచి తార్నాకలోని ఆయన నివాసానికి త‌ర‌లిస్తోన్న క్ర‌మంలో కోదండరాం మాట్లాడుతూ... ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తన‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన తీరు అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. జేఏసీతో భేటీ అయి త‌మ‌ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని కోదండరాం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News