: జయలలిత మృతిపై విచారణ జరిపిస్తే శశికళకు జీవిత ఖైదు: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు


డీఎంకే శాసనసభాపక్షనేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో నిరాహారదీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తే శశికళకు జీవిత ఖైదు ఖాయమని అన్నారు. తాము ఆందోళనలు చేస్తున్నది తమకోసం కాదని ఆయన చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో కొలువుదీరిన బినామీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఒక్క రోజు నిరాహారదీక్షలు చేపట్టామని ఆయన తెలిపారు. తన చొక్కా చింపి, తమను బలవంతంగా బయటకు పంపి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై పోరాటంలో భాగమే ఈ నిరాహార దీక్ష అని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News