: ఎట్టకేలకు ప్రొ.కోదండరాంను విడిచిపెట్టిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో నిరుద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించాలని చూసిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాంని ఈ రోజు తెల్లవారు జామున మూడున్నర గంటలకే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఏ స్టేషన్‌కు తీసుకెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. అయితే, కొద్దిసేపటి క్రితం ఆయనను హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్ట్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయనను నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు రాత్రి కోదండరాం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా, కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.