: కొత్త పార్టీ పెడితే పెట్టుకోవచ్చు: కోదండరాంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హోంమంత్రి నాయిని
టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నిరుద్యోగ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు నాయిని మీడియాతో మాట్లాడుతూ... కోదండరాం కొత్త పార్టీ పెడితే పెట్టుకోవచ్చని అన్నారు. ఆ హక్కు, స్వేచ్ఛ ఆయనకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. అంతేగాని తమపై కుట్రలు మాత్రం చేయొద్దని ఆయన హితవు పలికారు. కోదండరాం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని అన్నారు. అనుమతి ఇవ్వకున్నా ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు.