: సైకిల్‌తో వ్యాన్ ను వెంబడించింది... పోకిరీలను గట్టిగా హెచ్చరించింది!


త‌న‌ను వేధించాల‌నుకున్న కొంత మంది పోకిరీల‌కు ఓ యువ‌తి త‌గిన‌ బుద్ధి చెప్పింది. లండ‌న్‌లో ఓ అమ్మాయి సైకిల్‌ పై వెళుతోంది. అదే స‌మ‌యంలో వ్యాన్‌లో వెళుతున్న కొంతమంది ఆ యువ‌తిపై ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ వెక్కిరించారు. ముందు ఆ యువ‌తి వారిని ప‌ట్టించుకోలేదు. అయితే, ఆమె ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగిన‌ప్పుడు కూడా ఆ వ్యాన్ లో నుంచి కొంద‌రు అస‌భ్యంగా వ్యాఖ్య‌లు చేశారు. తమ ఫోన్‌ నెంబర్‌ తీసుకోవాలని అన్నారు. 'నీ ఫోన్ నెంబ‌ర్ చెప్పూ' అంటూ రెచ్చిపోయారు. అంత‌లో గ్రీన్‌ సిగ్నల్ పడింది. కోపం తెచ్చుకున్న ఆ అమ్మాయి వారిని విడిచిపెట్టకుండా సైకిల్ పైనే వెంబ‌డించింది. ఓ చోట ఆగిన వ్యాన్‌ వద్దకు వెళ్లి దాని సైడ్‌ మిర్రర్‌ను విరిచి నేలకేసి కొట్టింది. వారిపై తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసి, హెచ్చ‌రించింది. ఈ సంద‌ర్భంగా ఒక‌రు తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  • Loading...

More Telugu News