: పోలీస్ స్టేషన్‌లో బ్లేడుతో ఒళ్లంతా గాయపరుచుకుని కలకలం సృష్టించిన నిందితుడు!
రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ బ్లేడుతో ఒళ్లంతా గాయపరుచుకుని తీవ్ర రక్తమోడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సుమారు 150 కేసుల‍్లో నిందితుడుగా ఉన‍్న తమిళనాడుకు చెందిన నవాజ్ షరీఫ్‌ను చెన‍్నై పోలీసులు కేసుల విచారణ నిమిత‍్తం ఒంగోలు తీసుకొచ్చారు. కాగా, విచారణలో భాగంగా పీటీ వారెంట్‌పై టూటౌన్ పోలీసులు ఆ ఖైదీని స్టేషన్‌కు తీసుకువచ్చారు.
అయితే, తన వద్ద దాచుకున్న ఓ బ్లేడును బయటకు తీసిన సదరు ఖైదీ.. ఒక్కసారిగా ఆ బ్లేడుతో కోసుకోవడం ప్రారంభించి కలకలం రేపాడు. అనంతరం ఒళ్లంతా గాయాలతో రక్తమోడుతూ సొమ‍్మసిల్లి పడి పోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు చికిత్స చేయిస్తున్నారు.