: 13 ఏళ్ల తరువాత రైలు ప్రయాణం చేసిన ధోనీ!


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 13 ఏళ్ల తరువాత ట్రైన్ ఎక్కాడు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు జార్ఖాండ్ జట్టు సభ్యులతో కలిసి ధోనీ హతియా-హౌరా ఎక్స్ ప్రెస్ లో రాంచీ నుంచి హౌరా వరకు ప్రయాణించాడు. గతంలో రైల్వే టీసీగా పని చేసిన ధోనీ, టీమిండియాకు ఎంపిక కావడంతో దశతిరిగింది. తరువాత స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్ గా ఎంపికవడంతో ధోనీ జీవితం పూర్తిగా మారింది. దీంతో ట్రైన్ ఎక్కాల్సిన అవసరం రాలేదు. పెద్దపెద్ద ఎండార్స్ మెంట్లతో భారీ ఎత్తున సంపాదించిన ధోనీ ఇప్పుడు కూడా రైలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.

అయితే, దేశవాళీ క్రికెట్ ఆడే క్రమంలో జట్టులోని సహ ఆటగాళ్లతో కలిసి జార్ఖాండ్ క్రికెట్ బోర్డు సూచించిన విధంగా రైల్లో ఏసీ కోచ్ లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సహచరులతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు. గతంలో తాను జనరల్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణించేవాడినని, ఇప్పుడు చాలా కాలం తరువాత సహచరులతో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ధోనీ ప్రయాణం సందర్భంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రైల్వే వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News