: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్' హైదరాబాద్ బ్రాంచ్ లో భారీ కుంభకోణం
హైదరాబాదులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ చైతన్యపురి శాఖలో భారీ కుంభకోణం వెలుగు చేసింది. అనర్హులకు రుణాలు మంజూరు చేసి రూ. 3 కోట్ల ధనాన్ని బ్యాంక్ మేనేజర్ మురళి నాయక్ దుర్వినియోగం చేశారు. తీరా తన తప్పు బయటపడే సరికి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క, బ్యాంక్ లీగల్ సెల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి, మురళినాయక్ ను దోషిగా తేల్చారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.