: లిబియా తీరానికి భారీగా కొట్టుకొచ్చిన మృతదేహాలు


మధ్యదరా సముద్రం మ‌రోసారి మృత్యుసాగ‌రంలా క‌న‌ప‌డింది. ఆ సముద్ర తీరానికి ఏకంగా 74 మృత దేహాలు కొట్టుకొచ్చాయి. ఆఫ్రికా నుంచి యూరప్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యదరా సముద్రంలో పడవ మునిగిపోవ‌డంతో దానిలో ప్ర‌యాణిస్తోన్న వారు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. దీంతో సాగ‌ర తీరం అంతా మృత‌దేహాల గుట్ట‌లా క‌నిపించింది. సిరియా, లిబియాలోని శ‌ర‌ణార్థులు స‌ముద్ర మార్గం ద్వారా ఇత‌ర దేశాల‌కు వెళుతూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News