: పాకిస్థాన్, చైనాలకు వ్యతిరేకంగా బలూచిస్థాన్ వాసుల ప్రదర్శన
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలూచిస్థాన్ ఉద్యమకారులు మరోసారి పోరుబాటపట్టారు. దీంతో లండన్ లోని చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బలూచ్ పోరాట యోధులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పాకిస్థాన్ దురాగతాలకు చైనా మద్దతిస్తోందని మండిపడ్డారు. బలూచిస్థాన్ లో చైనా నిర్మిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. భారీ ఎత్తున ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.