: కలకలం రేపుతున్న నకిలీనోట్లు.. ఏటీఎం నుంచి కూడా అవే వచ్చేస్తున్నాయ్!


కేటుగాళ్లు త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకున్నా రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన కొత్త నోట్లకు న‌కిలీ నోట్లు తీసుకురాలేర‌ని మొద‌ట్లో అంతా అనుకున్నారు. అలాంటి క‌ట్టుదిట్ట‌మైన ఫీచ‌ర్ల‌తో రూ.2000 నోటును తీసుకొచ్చార‌ని చెప్పుకున్నారు. కానీ, మార్కెట్లో నకిలీ నోట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఏకంగా ఏటీఎం కేంద్రం నుంచే న‌కిలీ నోట్లు రావ‌డంతో ఓ ఖాతాదారుడు షాక్ అయ్యాడు.

రూ.8000ను విత్‌ డ్రా చేసుకున్న ఖాతాదారుడికి నాలుగు రూ.2000 దొంగ నోట్లు వ‌చ్చేశాయి. ఆ నోట్లు మొత్తం అచ్చం కొత్త రూ.2000 నోట్లలాగే ఉన్నాయి. కానీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఉంది. ఢిల్లీలోని సంఘం విహార్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు వ‌చ్చాయి. దీనిపై అక్క‌డి పోలీసులు ఆరాతీస్తున్నారు. బ్యాంకు అధికారుల‌ను కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News