: ఐఎస్ఐఎస్ చెరలో ఉన్న తెలుగు వైద్యుడికి విముక్తి


ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చెరలో ఉన్న తెలుగు వైద్యుడు రామమూర్తికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన వారు. ఐఎస్ చెర నుంచి రామమూర్తి విడుదలయ్యారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆయనను తక్షణమే ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. బుల్లెట్ గాయంతో ఆయన బాధపడుతున్నారని... ఇండియాకు వచ్చిన వెంటనే ఆయనకు చికిత్స చేయించనున్నామని తెలిపారు.

డాక్టర్ రామమూర్తి లిబియాలోని సిర్తె పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఫిజీషియన్ గా పని చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆ ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రామమూర్తితో పాటు ఒడిశాకు చెందిన మరో డాక్టర్ ను, ఫిలిప్పీన్స్ కు చెందిన ఏడుగురు నర్సులను అపహరించుకుపోయారు. ఈ నేపథ్యంలో, తీవ్రవాదులతో మన దేశానికి చెందిన అధికారులు చర్చలు జరిపారు. ఈ క్రమంలో, మన దేశానికి చెందిన ఇద్దరు డాక్టర్లను విడిపించుకోగలిగారు. డాక్టర్లను విడిపించే పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన అధికార యంత్రాంగంపై సుష్మా స్వరాజ్ ప్రశంసలు కురిపించారు.  

  • Loading...

More Telugu News